ట్రంప్ శాంతి ప్రణాళిక: ఉక్రెయిన్ యుద్ధం ముగిసేనా? పుతిన్ షరతులు, నాటో విస్తరణ భయాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి మరోసారి శాంతి ప్రయత్నాలను ప్రారంభించారు. జెలెన్స్కీ ఇప్పటికే అంగీకరించారని ప్రచారం జరుగుతుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం షరతులు విధిస్తున్నారు. డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకోవడంతోపాటు, ఉక్రెయిన్ నాటోలో చేరకూడదన్నది ఈ ప్రణాళికలోని ప్రధానాంశాలు.

ట్రంప్ శాంతి ప్రణాళిక: ఉక్రెయిన్ యుద్ధం ముగిసేనా? పుతిన్ షరతులు, నాటో విస్తరణ భయాలు

Summery
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి మరోసారి శాంతి ప్రయత్నాలను ప్రారంభించారు. జెలెన్స్కీ ఇప్పటికే అంగీకరించారని ప్రచారం జరుగుతుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం షరతులు విధిస్తున్నారు. డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకోవడంతోపాటు, ఉక్రెయిన్ నాటోలో చేరకూడదన్నది ఈ ప్రణాళికలోని ప్రధానాంశాలు.
ఉక్రెయిన్ యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసిపోనుందంటూ మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి శాంతి ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ట్రంప్ రూపొందించిన శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే అంగీకరించారని, రష్యా అధినేత పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది.
చర్చలు జరపడానికి తనకు అభ్యంతరం లేదని పుతిన్ పేర్కొంటూనే, ఉక్రెయిన్ ఏమాత్రం వ్యతిరేకించినా యుద్ధరంగంలో తగిన జవాబు చెప్పడానికి తాను సిద్ధంగా ఉంటానని హెచ్చరించారు. ట్రంప్ మధ్యవర్తిత్వంలో, మార్గదర్శకత్వంలో తయారైన శాంతి ముసాయిదా ఉభయపక్షాల మధ్య చర్చలకు ఉపయోగపడుతుందే తప్ప, అదే అంతిమ ప్రాతిపదిక కాబోదని కూడా పుతిన్ స్పష్టం చేశారు.
నాటో విస్తరణపై రష్యా భయం: యుద్ధక్షేత్రంలో రష్యా సాధించిన విజయాలు, భవిష్యత్తులో దాని ప్రయోజనాల పరిరక్షణ పునాదిగానే ఒప్పందం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందం కుదరకపోతే, ఎంత కాలమైనా యుద్ధాన్ని కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యల సారాంశం. ట్రంప్ కొత్త ప్రణాళికకు ఉక్రెయిన్ అంగీకరించిందని, కేవలం కొన్ని చిన్నచిన్న అంశాలు మాత్రమే తేలాల్సి ఉందని అమెరికన్ మీడియా అంటోంది.
ఈ విషయంలో ట్రంప్ ముసాయిదా రష్యా ప్రయోజనాలకు ఎంతవరకు అనుకూలంగా ఉందన్నది ప్రధానం. ఉక్రెయిన్ సైన్యం అధీనంలో ఉన్న చిన్నపాటి ప్రదేశాలతో సహా మొత్తం డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించడం ఈ ప్రణాళికలో ప్రధాన అంశం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ నాటోలో చేరకూడదని ఆ ముసాయిదాలో స్పష్టంగా పేర్కొన్నారు.